కనిగిరిలో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రైలుతో అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారన్నారు. ఎంతోకాలంగా ఈ ప్రాంత ప్రజలు రైలు ఎక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారని,త్వరలోనే రైలు ఎక్కాలన్న కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు.