ఒంగోలు అర్బన్: జిల్లాలో కృత్రిమ కొరత సృష్టిస్తే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తాం: కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టించే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాలోని 195 బంకులను నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లైర్ తో పాటు ఓ పోలీస్ అధికారి, వీఆర్వో నిరంతరం అక్కడ ఉండి పెట్రోల్, డీజిల్ వాహనదారులకు అందేలా చూస్తారు అన్నారు. గుంటూరు, కృష్ణ, పల్నాడు జిల్లాలలో కొరత ఉందని సోషల్ మీడియాలో వచ్చిన కారణంగా ప్రజలందరూ ఒక్కసారిగా బల్క్ లో తీసుకు వెళ్ళడం వల్ల ఈ పరిస్థితులు కనిపించాయి అన్నారు. ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు.