శ్రీశైలం ,మహానంది పుణ్యక్షేత్రాలలో వెలసిన నందీశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం,అర్చన,పూజలు ఆలయ అధికారులచే వేద పండితులు,అర్చకులు వైభవంగా నిర్వహించారు,బుధవారం మార్గశిర బహుళ త్రయోదశి,మహాప్రదోషం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.ముందుగా వేదపండితులు వేద మంత్రాలతో పీఠార్చన, గణపతిపూజ,పుణ్యహవాచనం, ద్రవ్యపూజల అనంతరం పంచామృతంతోపాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకార్చనలు,హారతి పూజలు వైభవంగా నిర్వహించారు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు,