ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజబాబు
Ongole Urban, Prakasam | Jun 22, 2026
ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు అందజేశారు. వచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ రాజాబాబు అర్జీదారులతో అన్నారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించడం కూడా జరిగిందని కలెక్టర్ తెలిపారు.