గుంతకల్లు: గుత్తి శివారులోని పురుషోత్తం అనే రైతు పొలంలో విద్యుత్తు కేబుల్ వైర్లు, స్టార్టర్లు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
గుత్తి శివారులోని జెడ్ వీరారెడ్డి కాలనీ సమీపంలో పురుషోత్తం అనే రైతు పొలంలో విద్యుత్ కేబుల్ వైర్లు, స్టార్టర్లు చోరీకి గురయ్యాయి. గత కొంతకాలంగా పురుషోత్తం చుట్టుపక్కల పొలాల్లో కూడా కేబుల్ వైర్లు చోరీకి గురి కావడం జరిగింది. ఈ క్రమంలో పురుషోత్తం పొలంలో కూడా కేబుల్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. అనుమానితున్ని పట్టుకోవడానికి రైతులు ప్రయత్నించారు. తప్పించుకున్నాడు. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.