సంతనూతలపాడు: ఎనికేపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా డిప్యూటీ డిఈఓ చంద్రమౌలేశ్వర రావు
సంతనూతలపాడు మండలంలోని ఎనికేపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రకాశం జిల్లా డిప్యూటీ డిఈఓ చంద్రమౌలేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న విద్యాబోధనలను డిప్యూటీ డిఈఓ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలన్నారు. పాఠశాలలో జరిగే పరీక్షలకు సంబంధించిన మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.