ఒంగోలు అర్బన్: ఒంగోలులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన కలెక్టర్ రాజాబాబు, అందరూ యోగ చేయాలని విజ్ఞప్తి
Ongole Urban, Prakasam | Jun 8, 2026
సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరిగా చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు పట్టణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగ ఉపాధ్యాయుల చేయించిన యోగాసనాలను కలెక్టర్ రాజాబాబుతో పాటు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది అధికారులు వేశారు. నిరంతరం యోగా చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వానికి యోగ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.