అనంతపురం అర్బన్: కార్మిక దినోత్సవం రోజు నిరసనకు దిగిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని నర్సులు
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వ్యవహారానికి నిరసనగా కార్మిక దినోత్సవం రోజు నర్సులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలో మామూళ్ల కు లోబడి రోస్టర్ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నిరసన కు దిగారు.