డోన్: డోన్ మండలంలో దొంగల వాహనంపై పోలీసుల ఫైరింగ్
Dhone, Nandyal | Jul 2, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం ఓబులాపురం గ్రామం సమీపంలోని నేలకనుమ మిట్ట దగ్గర బులోరా వాహనంపై పోలీసులు ఫైర్ చేయడం జరిగింది. పట్టణంలోని పందులను దొంగలించి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు వెంబడించగా పోలీసు హైవే పెట్రోలింగ్ వాహనంపై రాళ్లతో దుండగులు దాడి చేయడంతో పోలీసులు ఫైర్ చేయడం జరిగింది. వాహనంతో పాటు దుండగులు పారిపోయారని సమాచారం పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.