కొత్తగూడెం: విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్
విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ అన్నారు.మంగళవారం కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో 2 రోజులపాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను ప్రారంభించిన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని,చిన్నతనంలో సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.పిల్లలందరూ తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించే ఒక మార్గమే ఇటువంటి పోటీలను పిల్లలకు ఉద్బోధించారు.వజిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకువెళ్లాలని అన్నారు