సంతనూతలపాడు: నాగులుప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై విద్యార్థులకు అవగాహన
నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయ పర్యవేక్షణ అధికారి జి రత్న ప్రసాద్ మాట్లాడుతూ.... బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తాయి అన్నారు. జరిమానా తోపాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోక తప్పదు అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు విద్యార్థుల దృష్టికి వస్తే ఆ సమాచారాన్ని పోలీసులు లేదా ఐసిడిఎస్ అధికారులకు తెలపాలని ఆయన సూచించారు.