మఖ్తల్: చదరంగం విద్యార్థుల మేధస్సును పెంచుతుంది: మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి 314 చెస్ బోర్డులను పంపిణీ చేశారు. పాలమూరు ఎన్. ఆర్. ఐ ఫోరం, చెస్ నెట్వర్క్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, చదరంగం ఆట విద్యార్థుల మేధస్సు, ఆలోచనా శక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, పాలమూరు ఎన్. ఆర్. ఐ. ఫోరం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు