ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద బీసీ బంద్కు మద్దతుగా బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. నడిరోడ్డుపై బీసీ నాయకులు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది. ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజన్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు