ఎల్బీనగర్ సర్కిల్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సారంగాపూర్ మండలం జగిత్యాలకు చెందిన కట్ట గణేష్ పట్టుబడ్డాడు. అతని వద్ద 7.75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయి వినియోగిస్తూ తన స్నేహితులు, కస్టమర్లకు అమ్మకాలు జరుపుతూ ఉంటాడని విచారణలో వెల్లడైంది.