బనగానపల్లె: ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి సచివాలయంలో మంగళవారం 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన తెలిపారు పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను తీసుకొని పనులను చేపట్టాలని మంత్రులకు సీఎం సూచించినట్లు మంత్రి బీసీ తెలిపారు గోదావరి పరివాహ ప్రాంతాన్ని శాశ్వత ఆస్తిగా నిలిచిన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు