ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదికలో, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ పాల్గొనారు, ఈ సందర్భంగా స్థానికులు ఇంటి, డ్రైనేజీ కాలువల సమస్యలపై మునిసిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు, అనంతరం నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ ఇతర శాఖ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కిషోర్ పాల్గొని పలు అంశాలపై సమీక్షించారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు