డోన్: బేతంచెర్ల మండలంలో త్రాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్షించిన ఎంపీపీ నాగభూషణం రెడ్డి
Dhone, Nandyal | Apr 15, 2026 వేసవిలో బేతంచర్ల మండలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఫజుల్ రహిమాన్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను ఎంపీటీసీలు సభ దృష్టికి తెచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని ఆయన సూచించారు.