అసిఫాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: సిపిఎం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్,శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతుందని వారు ఆరోపించారు.