తిరుపతి జిల్లా తడ జంక్షన్ పక్కనే ఉన్న హైవ్ డ్రైనేజ్, డంపింగ్ యార్డు రోజురోజుకో అడుగు అదుపు తప్పుతూ వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు, చెత్త రోడ్డుమీదికి ఎగబాకి ప్రజల్ని రోజూ ఊపిరాడనివ్వని స్థితికి తెస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఆసుపత్రికి వెళ్లే రోగులు, సచివాలయం సిబ్బంది, హోటల్కు వచ్చే వారు ఈ మార్గం మీదుగా వెళుతూ దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఇంతలా పారిశుద్ధ్యం పడకేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోరా అని గురువారం పలువురు స్థానికులు ప్రశ్నించారు.