కే.కోటపాడు మండలం కొరువాడ కళ్యాణ మండపంలోకి మారిన వసతి గృహం, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మార్పు
అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కే.కోటపాడు మండలం కోరువాడ బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో సోమవారం విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే.శ్రీదేవి, వెల్ఫేర్ ఆఫీసర్, సర్పంచ్ సహకారంతో మంగళవారం స్థానిక కళ్యాణ మండపంలోకి వసతి ప్రత్యేక గ్రాంటు విడుదలైందని, త్వరలో పనులు ప్రారంభమౌతాయని అధికారులు వెల్లడించారు. హాస్టల్ భవనానికి రూ.5 లక్షలు మంజూరు అయినట్టు అధికారులు వెల్లడించారు.