బనగానపల్లె: బనగానపల్లెలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంనిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, పెన్షన్ సౌకర్యం, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.