ఆత్మకూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ లో కల్తి వస్తూ బండ్లు ఆగిపోతున్నాయని ఆందోళనకు దిగిన వాహనదారులు
ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ లో కల్తి వస్తూ బండ్లు ఆగిపోతున్నాయని వాహనదారులు ఆందోళనకు దిగారు, సుమారు 100 పైగా బైకులు ఆగిపోవడంతో, ఒక్కొక్కరు పెట్రోల్ బంకకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు,అయితే పెట్రోల్ బంకు యజమాని మాత్రం తుఫాన్ కారణంగా పెట్రోల్ లో నీరు కలిసిందని తెలియజేశాడు, దీనికి వాహనాలు మాత్రం నిన్న సాయంత్రమే పెట్రోల్ లో నీరు కలిసిందని తెలిసిన కూడా యజమాని నిర్లక్ష్యంగా వాహనదారులకు పెట్రోలు విక్రయించాడని ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు,