సంగారెడ్డి: తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుంది : సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ హిందూ, ముస్లిం గొడవగా వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సీపీఐ పార్టీ కార్యాలయంలో వీర తెలంగాణ రైతాంగ పోరాట వార్షికోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వివరించారు. జిల్లా కార్య దర్శి సయ్యద్ జలాలుద్దీన్, ఆనంద్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొన్నారు