మద్దిపాడు మండలంలోని నేలటూరు గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్, మాజీమంత్రి మేరుగ నాగార్జున సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి స్థానికుల నుండి సంతకాల సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయం అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు వైసిపి తరఫున పోరాటం చేస్తామన్నారు.