నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో వినియోగించని వస్తువులకు వేలాలు, రూ. 4.50 లక్షల ఆదాయం
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
నంద్యాలలోని డీఎస్పీ కార్యాలయాల ప్రాంగణంలో గురువారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా రూ.4.50 లక్షలు వచ్చినట్లు సాయుధ బలగాల ఎస్పీ చిన్నికృష్ణ తెలిపారు. వినియోగించని కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జనరేటర్లు, యూపీఐ బ్యాటరీలు, తదితర వస్తువులకు నిర్వహించిన బహిరంగ వేలంలో 29 మంది పాల్గొన్నారని చెప్పారు. మొత్తం వస్తువులను అబ్దుల్ వాహబ్ దక్కించుకున్నట్లు వివరించారు.