క్రోసూరు: ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి 21న పరీక్ష - ప్రిన్సిపల్ మేరి సుజన్.
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరులోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి గాను ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జరుగుతుందని ప్రిన్సిపల్ మేరీ సుజన్ గురువారం తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు 9:30 కల్లా పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లను ఇంటర్నెట్ సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.