ఉరవకొండ: వేల్పుమడుగు గ్రామంలో వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో శనివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు వైయస్సార్సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం మెడల వంచుదామని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు రాకెట్ల అశోక్,హావలిగి భరత్ రెడ్డి, లత్తవరం గోవిందు విడపనకల్లు మండలం కన్వీనర్ కురువ రమేష్, పాల్తూరు వన్నురు స్వామిలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం వేల్పుమడుగు గ్రామ కమిటీని, యువజన విభాగం, మహిళా విభాగం రైతు విభాగ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.