ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన డిఎస్పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Jun 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసు అధికారులతో పాటు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పట్టణంలో సైకిల్ తొక్కి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు తెలిపారు.