ఉరవకొండ: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా సూపర్ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గుంతకల్ రోడ్ లో ఉన్న శ్రీ శిరిడి సాయి సూపర్ మార్కెట్ లో " సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ లో భాగంగా సూపర్ మార్కెట్ ను బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్. జీఎస్టీ తగ్గింపు వస్తువుల వినియోగంపై వినియోగదారులు, కొనుగోలుదారులతో మంత్రి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు చేకూరే లబ్ధిపై వారికి మంత్రి వివరించారు.