చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ
చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు.మంగళవారం నరసరావుపేటలో తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే వ్యాపారితో ఆయన మాట్లాడారు. వ్యాపార పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, వ్యాపారస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.