నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన హరివరం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది, దీంతో గ్రామస్తులు జింక మృతి చెందిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో అడవి శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని మృతి చెందిన జింకకు పోస్టుమార్టం నిర్వహించారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జయమ్మ పశువైద్యాధికారి రవీంద్రారెడ్డి తదితరులు జింక మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కార్యక్రమంలో పాల్గొన్నారు