రాయచోటి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, విద్యుత్ చార్జీల పెంపు, రైతు సమస్యలపై నిర్లక్ష్యం వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 15న రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనుంది.వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో సేకరించిన పత్రాలను జిల్లా కేంద్రం రాయచోటి నుంచి తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్న సందర్భంగా ఈ ర్యాలీ జరుగుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ర్యాలీకి ముందు ఉదయం 9 గంటలకు ఎస్ఎన్ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద సమావేశమై