నంద్యాల అర్బన్: నంద్యాల కూరగాయల మార్కెట్ అకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న
Nandyal Urban, Nandyal | May 8, 2026
నంద్యాల పట్టణ కూరగాయల మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ శేషన్న సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లపైకి దుకాణాలు రాకుండా చూడాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.