ఒంగోలు అర్బన్: మీకోసం లో వచ్చే అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్
Ongole Urban, Prakasam | Jul 7, 2026
మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమములో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్.ఓ.ఆర్, అసైన్మెంట్స్, రీ సర్వే, పట్టాదారు పాస్ పుసకాల పంపిణీ పై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా చర్చించారు.