కనిగిరి: ఈనెల 15వ తేదీన ఒంగోలులో జరుగు భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాసులురెడ్డి, సీనియర్ బిజెపి నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య పిలుపునిచ్చారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు శనివారం వాజ్పేయి విగ్రహావిష్కరణకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డికి, కూటమి నాయకులకు వారు ఆహ్వాన పత్రాలను అందజేశారు.