డోన్: డోన్ లో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు : మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్
Dhone, Nandyal | May 14, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, డ్రైవర్ అర్హతలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు కేవలం 60% బస్సులే తనిఖీలు పూర్తి చేసుకోగా, మిగిలిన వాహనాలను ఈ నెల 15లోపు డోన్ ఎంవీఐ కార్యాలయంలో హాజరు పరచాలని సూచించారు.