డోన్: బేతంచర్ల లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై వైసీపీ నాయకులకు కీలక ఆదేశాలు చేసిన మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Jul 6, 2026 SIR ప్రక్రియ ఈనెల 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ప్రతి బూత్ పరిధిలో బీఎల్వోలు నిర్వహిస్తున్న ప్రక్రియను బీఎల్ఎలు అప్రమత్తంగా పర్యవేక్షించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. బేతంచర్లలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఎలతో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.