డోన్: మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘనవిజయం,డోన్ లో సంబరాలు
Dhone, Nandyal | May 4, 2026 సోమవారం విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది దీంతో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సందు వెంకటరమణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు బండికిరణ్ జిల్లా ఐటీ కన్వీనర్ వీరేష్ బాబు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు