ఉరవకొండ: నకిలీ గొలుసు ఇచ్చి బంగారు షాపు వ్యాపారికి రూ. 1.4 లక్షల బురిడీ
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని బంగారు షాపు నిర్వాహకులు దాదాఖలందర్, తాజుద్దీన్ లను సోమవారం ఓ మహిళ నకిలీ బంగారు గొలుసు ఇచ్చి రూ. 1.4 లక్షలు బురిడీ కొట్టించిన ఆలస్యంగా గుర్తించిన వారు ఘటనపై సిసి ఫుటేజీతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని మహిళ 1.2 గ్రాముల బంగారు గొలుసు ఇచ్చి జత కమ్మలు 50 వేల నగదు తీసుకున్న పిదప బంగారు గొలుసును మార్చి నకిలీ గొలుసు అంట గట్టి ఉడాయించింది. ఆలస్యంగా గ్రహించి, ఘటనపై సీసీ ఫుటేజ్ లతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.