సర్వేపల్లి: లైసెన్సులు ఉంటేనే క్రాకర్స్ దుకాణాల ఏర్పాటు : పొదలకూరు సిఐ శివరామక్రిష్ణారెడ్డి
లైసెన్స్ ఉంటేనే క్రాకర్స్ దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఉంటుందని పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. పొదలకూరులో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్న హంసా కుమార్ రెడ్డి కల్యాణ మండపం ఆవరణన్నీ మండల అధికారులు తహశీల్దార్ శివ బాల కృష్ణయ్య కలసి అయన పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణాల లైసెన్స్ దారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను సీఐ తెలియజేశారు.