రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ను నాయుడుపేట పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.మంగళవారం మనుబోలు మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి వై.సత్య కుమార్ కు నాయుడుపేట బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బొల్ల కాయల విజయభాస్కర్,ఆశా చెంచు కృష్ణయ్య,ఆరుగురు సుధాకర్,యనమల అశోక్ తదితరులు మంత్రి సత్య కుమార్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు.