నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, పోలీసులు ఏఐటీయూసీ నాయకుల మధ్య వాగ్వాదం
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర పోలీసులు, ఏఐటీయూసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేటు ముట్టడించారు. గేటును తోసుకుని వస్తుండగా.. మహిళా పోలీసులు లేకుండా మహిళలను నెట్టడంతో దుమారం రేగింది. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు కూడా లేదా..! అని అంగన్వాడీ మహిళలు, ఏఐటీయూసీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు.