జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సువర్ణ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం, బాల్య వివాహ నిర్మూలనకు వందరోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎనికెపాడు గ్రామంలోనీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు నిర్వహించారు.బాలబాలికలకు చిన్న వయసులో వివాహం చేసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయని వివరిస్తూ వివాహ నిషేధ చట్టం ప్రకారంగా వివాహం జరిగించిన లేదా వివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష విధించడం జరుగుతుంది అని తెలియజేశారు. దీనితో పాటుగా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరుగుతుంది అని న్యాయ మరియు పరివీక్షణ అధికారి బి రత్న ప్రసాద్ తెలియజేశారు.