రాయచోటి మండలం కే. రామాపురం గ్రామంలోని మంగళ కాలనీకి 20 సంవత్సరాలుగా రోడ్డు సదుపాయం లేకుండా ఉన్న పరిస్థితి ముగిసింది. కూటమి ప్రభుత్వం హయాంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృషితో 15వ ఫైనాన్స్ నిధుల నుంచి రూ.54.19 లక్షలు మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.