డోన్: బేతంచర్ల మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పై వినూత్న రీతిలో అవగాహన
Dhone, Nandyal | Jul 7, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై గ్రామస్థులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. గ్రామంలో డప్పు చాటింపు నిర్వహిస్తూ ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించారు. ఈ నెల 14వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనున్నందున, ప్రతి ఓటరు తమకు అందజేసిన ఫారాలను పూర్తిగా నింపి గ్రామ సచివాలయంలో సమర్పించాలని కోరారు.