ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ కార్యక్రమం చేపట్టిన పోలీసు అధికారులు, పాల్గొన్న పలువురు యువత
Ongole Urban, Prakasam | May 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు ఆదివారం సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో సైక్లింగ్ నిర్వహించిన అధికారులు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం గంట పాటు వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను పోలీసులు ప్రజలకు వివరించి చెప్పారు. కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు.