అన్నమయ్య జిల్లాలో వర్షాలపై అప్రమత్తత:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 08561-293006 నంబర్‌కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించామని మంత్రి పేర్కొన్నారు.ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని, అవసరమైన సహాయ చర్యలు తక్షణమే చేపడతామని తెలిపారు.