నంద్యాల అర్బన్: మహానంది మండలంలో అనుమానాస్పద స్థితిలో మృతి
Nandyal Urban, Nandyal | May 8, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి తిమ్మపోగు రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని బావిలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బావి వద్దకు చేరుకొని రాజు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.