నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుండి మంగళవారం టియుసిఐ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎస్. కిరణ్ తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహ హాజరై మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ల అనుమతులు రద్దు చేయాలని కోరారు. అనంతరం తాహసిల్దార్ అమరేంద్ర కృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు.