ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్థానిక రవీంద్ర E.M.స్కూల్‌లో విద్యార్థిని, విద్యార్థులకు అగ్నిమాపక పరికరములు - వాటి ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక ఇన్చార్జ్, అధికారి మురళి కొండబాబు, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.